ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.

By -  అంజి
Published on : 7 Dec 2025 12:49 PM IST

Five year old boy, Tamilnadu, leopard , Valparai, tea estate

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్‌లో పనిచేస్తున్న అస్సాం వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ (5) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని తేయాకు పొదల నుంచి ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చిరుతపులి బాలుడిని పట్టుకుని తోటలోకి లాక్కెళ్లిపోయింది.

తోట లోని కార్మికులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత తోట లోపలి భాగంలో సైఫుల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఇదే ప్రాంతంలోని కావరకల్లు వద్ద నూర్జిల్ హక్ (8) అనే బాలుడు, జూన్ 22న పచ్చమలై వద్ద రోషిణి (4) అనే బాలిక చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

Next Story