జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు ఆర్మీ, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో

By అంజి  Published on  16 Jun 2023 4:22 AM GMT
Five terrorists killed, encounter, security forces, Jammu and Kashmir

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు ఆర్మీ, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచారం అందడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

"కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీలోని జుమాగుండ్ ప్రాంతంలో కుప్వారా పోలీసుల నిర్దిష్ట సమాచారంతో ఉగ్రవాదులు, ఆర్మీ అండ్‌ పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియజేయబడతాయి" అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్‌లో తెలిపారు. ఇదిలా ఉంటే.. జూన్ 13న కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌లో పంచుకున్నారు. దోబనార్ మచల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

"కుప్వారా జిల్లాలోని దోబనార్ మచల్ ప్రాంతంలో (ఎల్‌ఓసి) ఆర్మీ, కుప్వారా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు (02) ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది" అని జూన్‌ 13న ట్వీట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో జూన్ 2 న, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రాజౌరి సమీపంలోని దస్సల్ గుజ్రాన్ అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం, పోలీసులు సంయుక్త కార్డన్ అండ్‌ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రక్షణ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, వారు ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు.

Next Story