నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌

First Indian Private Rocket Vikram-S Launched Sriharikota. భారత్‌లో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ విజయవంతంగా

By అంజి  Published on  18 Nov 2022 6:34 AM GMT
నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌

భారత్‌లో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతం అయ్యిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించారు. అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట.. ఈ రాకెట్‌కు విక్రమ్-ఎస్ అని నామకరణం చేశారు.

ప్రముఖ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ను రూపొందించింది. సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు విక్రమ్-ఎస్‌ను అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది ప్రయోగించబోతున్న విక్రమ్-1 ఆర్బిటాల్ వాహనంలో ఉపయోగించే 80% సాంకేతికతలను ధృవీకరించడంలో ఈ ప్రైవేటు రాకెట్ ఉపయోగపడనుంది. ఇది మూడు కస్టమర్ పేలోడ్‌లను కలిగి ఉంటుంది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ మొత్తం బరువు 545 కిలోలు, ఎత్తు ఆరు మీటర్లు.

అంతరిక్ష వ్యాపారంలో మరింత ఎదగడం కోసం స్కైరూట్- ఇస్రోతో డీల్‌ కుదుర్చుకుంది. 'అందరికీ ఓపెన్ స్పేస్' అనేది స్కైరూట్‌ నినాదం. ఈ నినాదంతో వీరూ దీర్ఘకాలిక భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. అంతరిక్షంలో ఇకపై భారీ లాభాలు ఉండబోతున్నాయని చెబుతూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో చిన్న శాటిలైట్ల కోసం భారీగా డిమాండు పెరుగుతుందని, తద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చని స్కైరూట్‌ సంస్థ సీవోఓ నాగ భరత్‌ చెబుతున్నారు.

Next Story