ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

Fire on-board INS Vikramaditya, no casualties. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్వార్‌లో

By అంజి
Published on : 21 July 2022 10:50 AM IST

ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్వార్‌లో 18 నెలల రీఫిట్‌ - కమ్‌ - మెయింటెనెన్స్‌ తర్వాత సముద్రంలో ట్రయల్స్‌ నిర్వహిస్తుండగా నౌకలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మంటలను గమనించిన ఓడ సిబ్బంది వెంటనే ఓడలోని అగ్నిమాపక వ్యవస్థలను ఉపయోగించి అగ్నిమాపక చర్యలు చేపట్టారు. తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

''ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై విచారణకు భారత నౌకాదళం విచారణ బోర్డును ఏర్పాటు చేసింది. ఓడకు ఎంత మేరకు మంటలు లేదా నష్టం వాటిల్లింది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.'' అని ఇండియన్‌ నేవీ బుధవారం అర్ధరాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. 2019 ఏప్రిల్‌లో ఈ విమాన వాహక నౌకలో మంటలు చెలరేగడంతో యువ నౌకాదళ అధికారి మరణించారు. గతేడాది మేలో కూడా ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య విమానంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. భారత నౌకాదళం తన రెండవ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను వచ్చే నెలలో ప్రారంభించనుంది.

Next Story