రన్నింగ్‌లో ఉన్న బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలో ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 2:50 PM IST
Fire,  Bus, Driver Alert, Maharashtra, Thane,

రన్నింగ్‌లో ఉన్న బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలో పెనుప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం అయ్యాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను అందరినీ అలెర్ట్‌ చేశాడు.

మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన చోటుచేసుకుంది. థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. పొగలు బయటకు రావడంతో అందరూ భయపడిపోయారు. బస్సు డ్రైవర్‌ కూడా వెంటనే స్పందించాడు. మంటలు ఇంజిన్‌లో చెలరేగాయని గుర్తించి.. బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. దాంతో.. అలర్ట్‌ అయ్యిన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోయారు. బస్సు డ్రైవర్ అలర్ట్‌ కావడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

అయితే.. ప్రయాణికులు బస్సు దిగగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సౌకర్యార్థం థానే సిటీలో కొన్ని బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అగ్నిప్రమాదానికి గరైంది. థానే సిటీలోని సెట్రల్‌ గ్రౌండ్‌ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగుతుండగా ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story