అగ్నికి ఆహుతైన ఫేమస్ సినిమా హాల్

Fire broke out at Jaya cinema hall kolkata.పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జయా థియేటర్‌ బూడిదైంది. పశ్చిమ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 5:57 AM GMT
అగ్నికి ఆహుతైన ఫేమస్ సినిమా హాల్

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జయా థియేటర్‌ బూడిదైంది. పశ్చిమ బెంగాల్ లోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన జయా సినిమాస్‌లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. 50 ఏళ్ల నాటి ఈ సినిమా టాకీస్‌ పై అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. అవి సినిమా థియేటర్ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నివేదికల ప్రకారం, రాత్రి 10 గంటలకు మంటలు మొదట గుర్తించబడ్డాయి. అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 15 ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో.. అర్థరాత్రి దాటిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.

థియేటర్‌ పై అంతస్తులో సినిమా థియేటర్ లో పనిచేస్తున్న కుటుంబం ఉంటుంది. రాత్రి వారు వంట వండుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు థియేటర్‌ మొత్తానికి వ్యాపించాయి. మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా సినిమా థియేటర్‌లో ఎక్కువ భాగం కాలిపోయింది రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సినిమా థియేటర్ లో ఎన్నో హిట్ సినిమాలు ప్రదర్శించబడ్డాయని తెలుస్తోంది.

Next Story