ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెల‌రేగిన‌ మంటలు

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలో ఢిల్లీ-దర్భంగా క్లోన్ స్పెషల్ రైలు నంబర్ 02570 ఎస్-1 (స్లీపర్) కోచ్‌లో మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on  15 Nov 2023 8:45 PM IST
ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెల‌రేగిన‌ మంటలు

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలో ఢిల్లీ-దర్భంగా క్లోన్ స్పెషల్ రైలు నంబర్ 02570 ఎస్-1 (స్లీపర్) కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొంత మంది గాయపడినట్లు సమాచారం. గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ రైలు సరాయ్ భోపట్ స్టేషన్ గుండా వెళుతుండగా.. అందులో నుంచి పొగలు రావ‌డం కనిపించిన‌ట్లు అధికారులు తెలిపారు.

దర్భంగా క్లోన్ ప్రత్యేక రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళుతుండ‌గా.. స్టేషన్ మాస్టర్ S-1 కోచ్ నుండి పొగలు పైకి లేవ‌డంతో.. వెంటనే రైలును ఆపేశాడు. అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా కింద‌కు దింపారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.

న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుండి దర్భంగా వెళ్తున్న రైలు రెండు కోచ్‌లలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఇటావా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సంజయ్ కుమార్ మాట్లాడుతూ,.. 'ఢిల్లీ నుండి దర్భంగా వెళ్తున్న రైలులోని రెండు కోచ్‌లలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు కూడా గాయపడ్డారని తెలిపారు. అయితే ఎంత‌మంది గాయ‌ప‌డ్డార‌నేది వెల్లడించేందుకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిరాకరించారు. ఘటనా స్థలంలో వైద్యుల బృందం, అంబులెన్స్‌ ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఎలా చెలరేగాయి, ఎంత నష్టం వాటిల్లింది అనే వివరాలు తెలియాల్సివుంది.

Next Story