కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నిమాపక సిబ్బందికి గాయాలు

Fire breaks out in moving bus.. firefighters injured. ఆదివారం పూణెలోని చాందినీ చౌక్ సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  28 Feb 2022 8:52 AM IST
కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నిమాపక సిబ్బందికి గాయాలు

ఆదివారం పూణెలోని చాందినీ చౌక్ సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పే క్రమంలో కొందరు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అగ్నిమాపక శాఖ నుంచి అందిన సమాచారం మేరకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అగ్నిమాపక సిబ్బందిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ డిపోలో ఓ ఎల‌క్ట్రిక్ బ‌స్సుకు ఛార్జింగ్ పెడుతుండ‌గా ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఆర్టీసీ సిబ్బంది చూస్తుండ‌గానే క్ష‌ణాల్లో బ‌స్సు ద‌గ్థ‌మైంది. ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగడంతో సిబ్బంది భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన వారు ద‌గ్థ‌మైన బ‌స్సుకు స‌మీపంలోనే మ‌రో బ‌స్సుకు ఛార్జింగ్ పెట్ట‌గా.. ఆ బ‌స్సును అక్క‌డి నుంచి ప‌క్క‌కు తీసుకువెళ్లారు. లేక‌పోలే ఆ బ‌స్సు కూడా ద‌గ్థ‌మ‌య్యేద‌ని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ప్ర‌మాదంలో మూడు కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలిసింది.

Next Story