ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సీ 4 కంపార్ట్‌మెంట్(బోగీ)లో మంటలు చెలరేగాయి. రైలు నడుస్తూ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.మంటలను గమనించిన ప్రయాణీకులు వెంటనే చైన్ లాగారు. దీంతో రైలు నిలిచిపోయింది. వెంటనే అందులోని ప్రయాణీకులు కిందకు దిగారు. ప్రయాణీకులు దిగిన కొద్దిసేపటిలోనే రైలు భోగి పూర్తిగా మంటల్లో కాలీ దగ్ధమైంది. ఈ ఘటన హరిద్వార్‌లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా.. ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారని ఉత్తరాఖండ్ డీజీపీ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.