కరోనా హాస్పిట‌ల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

Fire breaks out at a hospital in Mumbai. ముంబయిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కరోనా బాధితులు మృతిచెంద‌గా

By Medi Samrat  Published on  26 March 2021 6:00 AM GMT
Fire breaks out at a hospital in Mumbai

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కరోనా బాధితులు మృతిచెంద‌గా.. ఇద్ద‌రు ఘ‌ట‌నా స్థ‌లంలోనే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. గురువారం అర్ధరాత్రి భాండూప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల ధాటికి ఆస్పత్రిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వివ‌రాళ్లోకెళితే.. భాండూప్ ప్రాంతంలో ఓ ప్రైవేటు షాపింగ్ మాల్‌ను కరోనా ఆస్పత్రిగా ఏర్పాటు చేశారు. అందులో 76 మంది చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ప్రాంతంలో మూడో అంతస్తులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ఇద్దరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మ‌రో ఏడుగురు చికిత్స పొందుతూ మృతిచెందార‌ని స‌మాచారం. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 23 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జ‌రిగిన‌ ఘ‌ట‌న‌తో హాస్పిట‌ల్‌లోని పేషంట్లను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు అధికారులు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story