అలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
కన్నూర్ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 1 Jun 2023 9:45 AM ISTఅలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
కన్నూర్ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో రైలులోని ఒక కోచ్ దగ్ధమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో రైలులోని ఇతర కోచ్‌లు కోచ్ నుంచి విడిపోయాయి. ఇంతలో పోలీసులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) యొక్క సిసిటివి ఫుటేజీని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి రైలులోకి ప్రవేశించడాన్ని చూశారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రైలుకు నిప్పు పెట్టింది ఆ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
అంతకుముందు ఏప్రిల్ 2 న కోజికోడ్ జిల్లాలో జరిగిన భయంకరమైన రైలు దహనం సంఘటనలో ఒక శిశువుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, రైల్వే చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోజికోడ్‌లోని ఎలత్తూరు సమీపంలోని కొరాపుజా వంతెన వద్దకు చేరుకోగానే అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌కు నిందితుడు షారుక్ సైఫీ నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ముగ్గురు రైలు కిందపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.