దుర్గా మాత మండపంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Fire at Durga Mata Mandapam in UP.. Three killed. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి జిల్లాలోని ఔరాయ్ పట్టణంలోని దుర్గాపూజ పండల్‌లో

By అంజి  Published on  3 Oct 2022 10:34 AM IST
దుర్గా మాత మండపంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి జిల్లాలోని ఔరాయ్ పట్టణంలోని దుర్గాపూజ పండల్‌లో భక్తులు పూజలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో 22 మంది తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాత్రి 9 గంటల సమయంలో పండల్ వద్ద హారతి నిర్వహిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

ప్రమాదం ధాటికి మండపం పూర్తిగా కాలపోయింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 45 ఏళ్ల మహిళ, 12 ఏళ్ల బాలుడు మరణించగా, ఈ ఉదయం మరో ఇద్దరు పిల్లు, ఓ మహిళ ఆసుపత్రిలో మరణించారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 150 మంది పాండల్‌లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రాథమికంగా కనిపిస్తోందని భదోహి జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు.

''ప్రార్థనల సమయంలో అగ్ని ప్రమాద సంఘటన జరిగింది. అది పీక్ టైమ్. పండల్ లోపల దాదాపు 150 మంది ఉన్నారు. 30 మందికి పైగా కాలిన గాయాలతో బయటపడ్డారు. కొందరిని సూర్య ట్రామా సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, గోపిగంజ్, ఆనంద్ ఆసుపత్రికి తరలించారు.'' అని అధికారి తెలిపారు. "అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా కనిపిస్తున్నప్పటికీ, కేసును దర్యాప్తు చేస్తున్న మా సాంకేతిక బృందం నుండి నిర్ధారణ కోసం మేము వేచి చూస్తున్నాం" అని అతను చెప్పాడు.

Next Story