ప్రపంచంలోనే కాస్ట్‌లీ పంట .. కిలో ఏంతంటే..

'hop-shoots' sell for Rs 1 lakh per kg. బిహార్ లో అత్యంత ఖరీదైన పంటగా పిలిచే హాప్ షూట్స్ మొక్కలను ప్రయోగ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.

By Medi Samrat  Published on  2 April 2021 3:08 AM GMT
hopshoots

ఏదన్నా కూరగాయ ధర 100 దాటిందంటే లబోదిబో అంటాం. అంతకంటే ఖరీదైన పంట మన దేశంలో ఉంటుందని కూడా ఊహించం. కానీ ఉంది. పోనీ ఖరీదు ఒక వెయ్యి రూపాయల అనుకుంటున్నారా కాదు కిలో అక్షరాల లక్ష రూపాయలు.. ఒక పంట ఇంత ధర ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి పంటను బిహార్ వాసి పండించాడు..

బిహార్​కు చెందిన అమరేశ్ సింగ్ ఈ అరుదైన పంటను పండిస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంటగా పిలిచే హాప్ షూట్స్ మొక్కలను ప్రయోగ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఆకుకూర, కాయగూరలకు మధ్యస్తంగా ఉండే హాప్ షూట్స్​ధర కేజీ సుమారు రూ.లక్ష వరకు పలుకుతుంది.

ఔరంగబాద్ జిల్లా నబీనగర్‌లోని కర్మ్‌డీడ్ గ్రామానికి చెందిన అమరేశ్‌సింగ్… చదవుకున్నది మాత్రం ఇంటర్మీడియట్. అమరేశ్.. తనకు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఐదు ఎకరాల పొలంలో ఓ ప్రయోగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువునా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.

ఈ బిహారీ పండిస్తున్న పంటను చూసి ప్రపంచ వ్యవసాయ మార్కెట్లు ఆశ్చర్యపోతున్నాయి. ఈ పంటకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటమే కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల క్రితమే వీటి ధర కిలోకు వెయ్యి పౌండ్లుగా ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం హాప్ షూట్స్ కిలోకు రూ.లక్షకు పైగా పలికుతుంది అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో హాప్ షూట్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కలకు పూసే పుష్పాలను బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. హాప్ షూట్స్ పూలు, పండ్లు, కాడలను యాంటీ బయాటిక్స్​ వంటి ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. వీటితో తయారు చేసిన ఔషధాలు టీబీ వంటి వ్యాధుల నివారణలో మెరుగ్గా పనిచేస్తాయి.

ఈ మొక్కల్లో ఉండే ఆమ్లాలు, మానవ శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడి, ఆందోళన, అనాల్జేసిక్​తో పాటు నిద్రలేమిని కూడా ఈ హాప్ షూట్స్‌తో నయం అవుతుందని అంటున్నారు. ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కవగా ఉన్నందున.. ఐరోపా దేశాల్లో బ్యూటీ కేర్‌లో ఉపయోగిస్తున్నారు.

అటు బీరులో సువాసన పెంచేందుకు కూడా ఇది వాడతారు. మొదట్లో మూలికా ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తూ వచ్చారు. అయితే కాలక్రమేనా కూరగాయల పంటగానూ ఇది మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. వీటి కాడలను వంటల్లో ఉపయోగిస్తారు.

ఈ పంట పండించాలంటే వాతావరణం చల్లగా ఉండాలి. తగినంత తేమ, సూర్యరశ్మి ఉంటే మొక్కలు వేగంగా పేరుగుతాయి. వారణాసిలోని ఇండియన్ వెజిటేబుల్ రీసెర్చ్​కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. లాల్ సహకారంతో హాప్ షూట్స్​ను అమరేశ్ పండిస్తున్నాడు.

Next Story
Share it