కళాకారుల ప్రదర్శన ఆకట్టుకోవడంతో అభిమానులు ఆనందంతో డబ్బుల వర్షం కురిపించారు. గుజరాత్ నవ్సారిలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో భజన గాయకుడు కీర్తిదన్ గాధ్విపై అభిమానులు కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. దాదాపు రూ. 50 లక్షల విరాళాలు అందాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గ మారాయి. నవ్‌సారిలో స్వామి వివేకానంద నేత్ర మందిర్ ట్రస్ట్ నిర్వహించిన భజన కార్యక్రమానికి వచ్చిన గాయకుడు కీర్తిదాన్ గాధ్విపై భక్తులు డబ్బుల వర్షం కురిపించారు.
డిసెంబరు 28వ తేదీ బుధవారం భజన కార్యక్రమం జరిగింది. కీర్తిదాన్ గాధ్వి, మరో జానపద గాయకులు ఊర్వశి రద్దియా ప్రదర్శన ఇచ్చారు. కంటి వైద్యం అవసరమైన వారి సంక్షేమం కోసం విరాళాల సేకరణ కోసం సూప గ్రామంలో స్వామి వివేకానంద నేత్ర మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. "ప్రజలు కచేరీ కార్యక్రమంలో 10, 20, 50,100 రూపాయల నోట్ల వర్షం కురిపించారని" అని గాధ్వి చెప్పారు. కచేరీ చూసేందుకు వందలాది మంది వచ్చారు. ఇందులో పెద్దలతో పాటు పిల్లలు, యువకులు కూడా ఉన్నారు.