కర్ణాటకను కుదిపేస్తున్న నెయ్యికి సంబంధించిన స్కామ్.. నభూతో నభవిష్యతి
బెంగళూరు నగరంలో నందిని డెయిరీ పార్లర్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నకిలీ నెయ్యి రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. అధికారిక పంపిణీదారుడు నిర్వహిస్తున్న...
By - అంజి |
కర్ణాటకను కుదిపేస్తున్న నెయ్యికి సంబంధించిన స్కామ్.. నభూతో నభవిష్యతి
బెంగళూరు నగరంలో నందిని డెయిరీ పార్లర్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నకిలీ నెయ్యి రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. అధికారిక పంపిణీదారుడు నిర్వహిస్తున్న కల్తీ నెట్‌వర్క్‌ను అధికారులు కనుగొన్నారు. తమిళనాడులో కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేసి, నకిలీ నందిని సాచెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) అధికారిక లైసెన్స్‌లను కలిగి ఉన్న బెంగళూరుకు చెందిన వ్యక్తులు వీటిని సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పంపిణీదారులు నకిలీ నెయ్యిని హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ అవుట్‌లెట్‌లు, నందిని పార్లర్‌లకు పూర్తి మార్కెట్ ధరకు విక్రయించారు.
KMF అధికారులు ఓ అసాధారణమైన విషయాన్ని గమనించిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. క్రమం తప్పకుండా పెద్ద మొత్తంలో నెయ్యి ఆర్డర్లు ఇచ్చే అధికారిక KMF డీలర్-కమ్-డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర అకస్మాత్తుగా తన కొనుగోళ్లను తగ్గించడం ప్రారంభించాడు. సాధారణంగా 100 లీటర్ల ఆర్డర్ ఇచ్చే మహేంద్ర, ఇటీవలి నెలల్లో సగం తగ్గిస్తూ ఆర్డర్ ఇచ్చేవారు. తనిఖీల్లో నిందితుడు మహేంద్ర పామాయిల్, ఇతర కొవ్వులను నిజమైన నందిని నెయ్యితో కలిపి, 1 లీటరు అసలైన నెయ్యిని 5 లీటర్ల కల్తీ ఉత్పత్తిగా మారుస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ నకిలీ నెయ్యిని నగరంలోని నందిని పార్లర్లకు సరఫరా చేశారు.
రహస్యంగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్, KMF విజిలెన్స్ వింగ్ సంయుక్తంగా ఈ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేశాయి. చామరాజ్‌పేటలోని మహేంద్ర, అతని కుటుంబానికి చెందిన కృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గోడౌన్లు, దుకాణాలు, గూడ్స్ వాహనాలపై అధికారిక బృందాలు దాడి చేశాయి. కల్తీ నెయ్యి రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశారు.