యూరియా, డిటర్జెంట్‌తో పాల తయారీ.. 'విషం' తాగుతున్నామా?.. FSSAI ఏం చేస్తోంది?

పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్‌, యూరియాతో పాలను తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

By -  అంజి
Published on : 8 Feb 2026 10:44 AM IST

Factory, milk, detergent, urea , Gujarat, FSSAI

యూరియా, డిటర్జెంట్‌తో పాల తయారీ.. 'విషం' తాగుతున్నామా?.. FSSAI ఏం చేస్తోంది?

పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్‌, యూరియాతో పాలను తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న గుజరాత్‌లో 300 లీటర్ల పాలతో 1800 లీటర్ల పాలు తయారు చేస్తున్నారని తేలడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని, FSSAI ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. తరచూ తనిఖీలు చేసి, కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

యూరియా, డిటర్జెంట్‌తో కల్తీ

యూరియా, డిటర్జెంట్‌, పామాయిల్‌, ప్రాణాంతక రసాయనాలతో నకిలీ పాలను తయారు చేస్తున్న ముఠాను గుజరాత్‌ అధికారులు పట్టుకున్నారు. రైతుల నుంచి సేకరించిన 300 లీటర్ల అసలైన పాలలో రసాయనాలను కలిపి 1800 లీటర్లుగా మార్చి అమ్ముతున్నారు. ఐదేళ్లుగా శ్రీసత్య డైరీ ప్రొడక్ట్స్‌ ఈ పాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రూ.75 లక్షల విలువైన కల్తీ పాలను అధికారులు సీజ్‌ చేశారు.

కల్తీ పాలను ఇలా చెక్‌ చేయండి

పాల చుక్కను ప్లేట్‌పై వేస్తే నెమ్మదిగా కారుతూ తెల్లటి గీతను ఏర్పరిస్తే అవి స్వచ్ఛమైనవి. జారిపోతే నీరు కలిపినట్టు.

సీసాలో పోసి ఊపినప్పుడు ఎక్కువ నురగ వస్తే డిటర్జెంట్‌ కలిపినట్టు.

పాలు మరిగించేటప్పుడు సబ్బు వాసన వచ్చినా, రుచి చేదుగా ఉన్నా అవి నకిలీ పాలని గుర్తించాలి.

అయోడిన్‌ వేసినప్పుడు నీలం రంగులోకి మారితే పిండి పదార్థం ఉన్నట్టు లెక్క

Next Story