సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల భారీ పేలుడు
ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లో ఆదివారం భారీ పేలుడు శబ్ధం వినిపించింది.
By అంజి Published on 20 Oct 2024 10:18 AM ISTసీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల భారీ పేలుడు
ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లో ఆదివారం భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పెద్ద శబ్ధాన్ని అనుసరించి.. రోహిణిలోని CRPF పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఒక ప్రదేశం నుండి పొగలు కమ్ముకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది. పాఠశాల గోడ చుట్టూ శబ్దం వచ్చి పేలుడు కారణంగా సమీపంలోని వాహనాల అద్దాలు పగిలిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాఠశాల గోడకు సమీపంలో అనేక దుకాణాలు ఉన్నాయి. సిలిండర్ పేలుడు కారణంగా పెద్ద శబ్దం వచ్చిందని వర్గాలు తెలిపాయి.
పేలుడు వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, ప్రాణనష్టం, గాయాలపై ఇంకా ఎలాంటి రిపోర్ట్ నివేదించబడలేదు. సోషల్ మీడియాలో పేలుడు వీడియోలు వైరలవుతున్నాయి. ఇవి పేలుడు ప్రభావం కారణంగా పాఠశాల సమీపంలోని దుకాణాలకు ఎంత మేరకు నష్టం జరిగిందో చూపిస్తున్నాయి. పేలుడు ధాటికి రోడ్లపై చెల్లాచెదురుగా ఉన్న దుకాణాల హోర్డింగ్‌లను వీడియోలు చూపిస్తున్నాయి. విచారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాన్ని పిలిచారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం బృందం ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై విచారణ జరుపుతోంది.