రోహిణి కోర్టులో పేలుడు కలకలం
Explosion in Rohini court injures one.దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం రేపింది.
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2021 7:33 AM GMTదేశరాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 11 సమయంలో కోర్టులోని రూమ్ నెంబర్ 102లో స్కూల్ బ్యాగ్‌లో ఉంచిన ల్యాప్ టాప్ పేలింది. ఏం జరిగిందో తెలియక కోర్టులో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. నేలపై ల్యాప్‌టాప్ పడి ఉన్న వీడియోలు, పోలీసు సిబ్బంది చుట్టూ పరుగెత్తుతున్న వీడియోలు బయటపడ్డాయి. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో కనీసం ఒకరికి గాయాలు అయినట్లు రోహిణి బార్ ధృవీకరించింది. బ్యాగ్‌లో ఉంచిన ల్యాప్‌టాప్ బ్యాటరీ వల్లే పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అయితే బ్యాగ్‌లో టిఫిన్ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఫోరెన్సిక్ మరియు క్రైం బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి.
Delhi: A suspicious explosion took place at Rohini Court today morning. Seven fire tenders were rushed to the spot. Details awaited. pic.twitter.com/twqNLqNk4l
— ANI (@ANI) December 9, 2021
కాగా.. గతంలో ఇదే కోర్టులో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఓ నిందితుడిని హతమార్చడంలో భాగంగా కాల్పులు జరిగాయి. రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగితోపాటు ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.