పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని 2 రూపాయలు పెంచింది.

By Medi Samrat
Published on : 7 April 2025 3:45 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

గ‌త కొన్ని నెల‌లుగా నిలకడగా ఉన్న పెట్రోల్‌, డిజీల్ ధరలు మళ్లీ పెర‌గ‌నున్నాయనే వార్తలు వచ్చాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ‌న్న వార్త‌లు తీవ్రంగా జ‌నాల్లోకి వ్యాపించాయి. ఈ నేథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఏమా,త్రం ఉండబోదని స్పష్టం చేసింది. ఎక్సయిజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. వాహనదారులు, ప్రజలు అవాస్తవాలు నమ్మి గందరగోళానికి గురికావొద్దని సూచనలు చేసింది.

ఎక్సైజ్ డ్యూటీ పెంపు దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.66, డీజిల్‌ ధర రూ.95.82గా ఉండ‌గా.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.76, డీజిల్‌ ధర రూ.97.51గా వుంది.

ఇదిలావుంటే.. అమెరికా పరస్పర సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాల నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరలు వాస్తవానికి తగ్గుతున్న సమయంలో ఈ పెంపు నిర్ణయం వచ్చింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం చూపించనుంది. ఈ ధరల పెరుగుదల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపనుంది.



Next Story