ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. ఎగ్జామ్ ఫ్రం హోమ్‌

Inter Exams From Home. ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలపై సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇంటి వద్ద నుండే ప‌రీక్ష‌ రాసే అవకాశం కల్పించింది.

By Medi Samrat  Published on  23 May 2021 4:07 PM IST
exams from home

క‌రోనా విజృంభ‌ణ నేఫ‌థ్యంలో ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలపై సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇంటి వద్ద నుండే ప‌రీక్ష‌ రాసే అవకాశం కల్పించింది. జూన్ 1 నుంచి ఈ ప‌రీక్ష‌లు వినూత్న త‌ర‌హాలో జ‌రుగ‌నున్నాయి. విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం తీసుకెళ్లి.. ఇంటి దగ్గరనుండే ప‌రీక్ష రాసేయొచ్చు. ఇక‌ ఎగ్జామ్ రాశాక ఐదు రోజుల్లో ఆన్సర్ షీట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే.. ప‌శ్నాప‌త్రం కోసం జూన్ 1న విద్యార్ధులు ఎగబడకుండా..1 నుంచి 5వ తేదీల‌లోపు వీలు చూసుకుని ఎప్పుడైనా తీసుకెళ్లే అవకాశం కల్పించారు. అలాగే తీసుకెళ్లిన రోజు నుంచి 5 రోజుల్లోగా జవాబు పత్రాలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అంటే 5 రోజుల్లోగా తిరిగివ్వకపోతే ఆబ్సెంట్ గా పరిగణిస్తామని ఛత్తీస్‌ఘడ్‌ ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.కె.గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ‌ ఉత్తర్వుల ప్రకారం.. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి, రాష్ట్రవ్యాప్తంగా 2.86 లక్షల మంది విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ప‌రీక్ష‌ల‌పై పూర్తి విధి విధానాలను నేడు లేదా రేపు వెల్లడించే అవకాశం ఉంది.


Next Story