ఆటో డ్రైవర్ తో మాజీ ఎమ్మెల్యే గొడవ.. చివరికి ఏమైందంటే?
ఆటో డ్రైవర్‌తో గొడవ కారణంగా గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్ మరణించారు.
By అంజి Published on 15 Feb 2025 6:37 PM IST
ఆటో డ్రైవర్ తో మాజీ ఎమ్మెల్యే గొడవ.. చివరికి ఏమైందంటే?
ఆటో డ్రైవర్‌తో గొడవ కారణంగా గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్ మరణించారు. బెలగావి జిల్లాలో శ్రీనివాస్ లాడ్జి సమీపంలో మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో మామ్లేదార్ వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మమ్లేదార్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
ఘటన చోటు చేసుకున్న ప్రదేశంలోని CCTV ఫుటేజీలో ఇద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు చూపిస్తుంది. మొదట్లో మామ్లేదార్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. మమ్లేదార్ డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టడంతో వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. చుట్టుపక్కలవారు వారిని విడదీయడానికి ప్రయత్నించినప్పటికీ, ఘర్షణ కొనసాగింది. డ్రైవర్ మామ్లేదార్‌పై దాడికి పాల్పడ్డాడని, ఘటన జరిగిన వెంటనే కుప్పకూలిపోయాడని తెలుస్తోంది.
మామ్లెదార్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన మాజీ సభ్యుడు లావూ మమ్లేదార్ గోవా అసెంబ్లీలో శాసనసభ్యుడిగా పనిచేశారు. మాజీ రాజకీయ నాయకుడి ఆకస్మిక మరణం గోవా, కర్ణాటకలోని అతని మద్దతుదారులను, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అరెస్టయిన ఆటో డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, ఘటనా స్థలం నుంచి మరిన్ని ఆధారాలను సేకరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.