ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. ఇక నుంచి రైల్వే స్టేషన్లలలో కూడా..

Electric Vehicle Charging Stations In Railway Stations. ముంబైలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఇంధనం ద్వారా కాలుష్యం

By Medi Samrat
Published on : 19 Feb 2021 7:45 AM

Electric Vehicle Charging Stations In Railway Stations

ముంబైలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఇంధనం ద్వారా కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో నగరంలో చార్జింగ్‌ పాయింట్లను సైతం పెంచబోతున్నారు. ముంబై ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి ముంబై సెంట్రల్‌ రైల్వే, యుఎన్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం, టాటా పవర్‌ సహకారంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పవర్‌ సహకారంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాలు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లోని అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ఎలక్ట్రికల్‌ వాహనాల చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.

మొదటి దశలో...

కాగా, మొదటి దశలో సీఎస్‌ఎమ్‌టీ (ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌), థానే, దాదర్‌, పరేల్‌, బైకుల్లాతో సహా కీలకమైన రైల్వే స్టేషన్‌లలో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో కుర్లా ఎల్‌టీటీ (లోక్‌మన్య తిలక్‌ టెర్మినల్‌), భండప్‌, పన్వెల్, కుర్లాతో సహా మరికొన్ని స్టేషన్లు ఉన్నాయి. పార్కింగ్‌ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్ల ఎంట్రీ- ఎగ్జిట్‌ వద్ద ఉన్న ప్రాంతాలు చార్జింగ్‌ స్టేషన్‌ల కోసం కేటాయించారు. ఇటీవల రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. 2017-18లో మహారాష్ట్రలో ఎలక్ట్రికల్‌ కార్లు, స్కూటర్లు 1,459 ఉండగా, 2019-20లో 7,400లకు పెరిగింది. ముంబైలో ఈ సంఖ్య 46 నుంచి 672క చేరింది.

ఈ-టాటా పవన్‌, యుఎన్‌ఈపీ భాగస్వామ్యంతో..

ఈ టాటా పవర్‌, యుఎన్‌ఈపీ భాగస్వామ్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ వద్ద ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ముంబై సెంట్రల్‌ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాబిన్ కాలియా తెలిపారు. ముంబై డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను వ్యవస్థాపించడానికి ఈ మోడల్‌ను ఎక్స్‌ట్రాపోలేట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. భారతదేశంలో రవాణా రంగం మొత్తం ఇంధన వినియోగంలో 18% వాటా కలిగి ఉంది. సంవత్సరానికి 142 మిలియన్ టన్నుల CO2 విడుద‌ల‌వుతోంది. ఇందులో 123 మిలియన్ టన్నులు రోడ్డు రవాణా విభాగం ద్వారా విడుద‌ల అవుతోందని ఆయన అన్నారు.


Next Story