జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025 సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక బుక్‌లెట్ రిలీజ్ చేసింది.
ఇందులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యత, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ప్రత్యేక ఓటింగ్ విధానం, ఎంపీలు మాత్రమే ఓటు వేసే ఎన్నిక, అభ్యర్థి అర్హత, ఓటింగ్ విధానం వంటి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కాగా 1952 నుంచి ఇప్పటివరకు 16 ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ప్రజలకు అవగాహన పెంపుదల లక్ష్యంగా ఈ బుక్‌లెట్‌ను ఎన్నికల కమిషన్ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది.