Video : ఆయ‌న‌కు ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. న‌వ్వులు పూయించిన షిండే

మహారాష్ట్రలో సీఎం అభ్య‌ర్ధిపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 11:56 AM GMT
Video : ఆయ‌న‌కు ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. న‌వ్వులు పూయించిన షిండే

మహారాష్ట్రలో సీఎం అభ్య‌ర్ధిపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ బుధవారం ఎన్నికయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వాదనలు వినిపించిన అనంతరం మహాయుతికి చెందిన ముగ్గురు నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో వాతావరణం హాస్యభరితంగా మారింది.

ఏక్నాథ్ షిండే సంకీర్ణ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వంలో కొనసాగాలని షిండేను అభ్యర్థించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. అయితే షిండే ప్రభుత్వంలో చేరతారో లేదో చెప్పలేదు.

అయితే.. మహాయుతి నేతలు మాత్రం విలేకరుల సమావేశంలో నవ్వులు పూయించారు. నిజానికి డిఫ్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని ఓ జర్నలిస్ట్ షిండేను అడిగాడు. దీనిపై షిండే స్పందిస్తూ.. సాయంత్రం వరకు ఆగాల్సిందేన‌న్నారు. అప్పుడు పక్కనే కూర్చున్న ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్.. 'ఆయన (ఏక్‌నాథ్ షిండే) ఏం చేయ‌నున్నారో సాయంత్రానికి తెలుస్తుంది.. కానీ నేను ప్రమాణం చేయబోతున్నాను అన్నారు. దీనికి అంద‌రూ న‌వ్వుతుండ‌గా.. షిండే మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకుని.. 'దాదా (అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయ‌న‌కు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్ద‌గా నవ్వడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

Next Story