చెరువులోకి దూసుకువెళ్లిన కారు.. 8 మంది జ‌ల‌స‌మాధి

Eight dead after vehicle falls into pond in Bihar’s Purnia.బీహార్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 1:16 PM IST
చెరువులోకి దూసుకువెళ్లిన కారు.. 8 మంది జ‌ల‌స‌మాధి

బీహార్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు త‌ప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు.

వివ‌రాల్లోకి వెళితే.. కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందిన కొంద‌రు శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి హాజ‌ర‌య్యారు. పార్టీ ముగిసిన అనంత‌రం స్వ‌గ్రామానికి కారులో బ‌య‌లుదేరారు. శ‌నివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో పూర్ణియా ప్రాంతానికి చేరుకునే స‌రికి కారు అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న చెరువులోకి దూసుకువెళ్లింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కారును వేగంగా న‌డ‌ప‌డం, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది.

Next Story