జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. మీర్జా చౌకీ, బెర్హత్, రాజ్‌మహ్, సాహెబ్‌గంజ్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో కీలక ఆధారాల కోసం ఈడీ జల్లెడ పడుతోంది. సీఎం సోరెన్ ప్రతినిధి పంక్ మిశ్రా ఇంట్లోనూ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. రైడ్ సమయంలో ఈడీ అధికారులు పారామిలిటరీ బలగాల సాయం తీసుకున్నారు. సీఎం సోరెన్‌పై మైనింగ్ స్కామ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఈడీ గతంలోనే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది.