దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు.. నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

ED arrests Nawab Malik in money laundering case linked to Dawood Ibrahim. దావూద్ ఇబ్రహీం, అండర్ వరల్డ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌సిపి నాయకుడు,

By అంజి  Published on  23 Feb 2022 4:28 PM IST
దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు.. నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

దావూద్ ఇబ్రహీం, అండర్ వరల్డ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించిన తర్వాత బుధవారం అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి దర్యాప్తు సంస్థ నవాబ్ మాలిక్‌ను ప్రశ్నిస్తోంది. అరెస్టు తర్వాత, నవాబ్ మాలిక్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. "లదేంగే ఔర్ జీతేంగే (పోరాడి గెలుస్తాను)" అని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మంత్రి అన్నారు.

రిపోర్ట్‌ ప్రకారం.. అండర్ వరల్డ్ డాన్, టెర్రర్ ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్‌కు సమన్లు ​​జారీ చేయబడ్డాయి. గత వారం అండర్ వరల్డ్, దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన అంశాల కోసం ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ప్రారంభించింది. దావూద్ ఇబ్రహీంపై ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసుకు సంబంధించి ఈడీ దాడులు నిర్వహించింది.

దావూద్ ఇబ్రహీం, సర్దార్ షావలీ ఖాన్, హసీనా పార్కర్, అంగరక్షకుడు సలీం పటేల్‌తో నవాబ్ మాలిక్ చేసిన ఒప్పందం ఏజెన్సీ పరిశీలనలో ఉంది. హసీనా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి. నవాబ్ మాలిక్ సర్దార్ షావలీ ఖాన్, సలీం పటేల్ నుండి కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కేవలం రూ. 30 లక్షలకు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. మాలిక్‌తో పాటు అతడికి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు సంబంధించిన మరికొన్ని వ్యాపార లావాదేవీలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మాలిక్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలతో ఏజెన్సీ పకడ్బందీగా ఉందని, అతనిపై చర్యలు తీసుకోవచ్చని వర్గాలు తెలిపాయి.

Next Story