గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వర్సెస్ తృణముల్ కాంగ్రెస్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం చేయడానికి వెళ్లిన సమయంలో ఆమెపై కొంతమంది దాడి చేయడం.. కాలుకు దెబ్బతగిలిన విషయం తెలిసిందే. ఆమె వీల్ చైర్ పైనే కూర్చొని ప్రచారం చేస్తుంది. ఇదిలా ఉంటే నను చంపడానికి కుట్ర జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
బంకురలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులంతా హోటళ్లు బుక్ చేసుకున్న ప్రదేశంలోనే తనపై దాడి జరిగిందని, నిజానికి తనను చంపడానికి కుట్ర జరిగి కొద్దిలో తప్పిందని అన్నారు. ఎన్నికల సంఘం చేత టీఎంసీపై తప్పుడు కేసులు వేయడానికి చూస్తున్నరని మమతా బెనర్జీ అన్నారు. ఇదిలా ఉంటే.. పదే పదే తమపై ఆరోపణలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బలమైన సందేశాన్ని పంపించింది.
ప్రతిసారీ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ ఎన్నికల సంఘం స్థాయిని దిగజార్చడం సరికాదని స్పష్టం చేసింది. ఈసీ పార్టీలను కలవాలని అనడం సంఘం ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు మమత రాసిన లేఖకు ఈసీ సమాధానమిచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి మేలు చేస్తోందని మమత పదే పదే ఆరోపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.