అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు(శుక్రవారం) ఉదయం 6.56 గంటలకు పాంగిన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. భూకంప కేంద్రాన్ని పాంగిన్‌కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో, భూమి అంతర్భాగంలో 30 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. కాగా.. భూ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.