కోల్‌కతాలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు..!

కోల్‌కతా నగరం సహా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 1:57 PM IST

National News, Bengal, Kolkata Earthquake, WestBengal, Earthquake Alert

కోల్‌కతాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత..భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

కోల్‌కతా నగరం సహా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. సెకన్ల పాటు భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు, కార్యాలయాలు మరియు బహుళ అంతస్తుల భవనాల నుండి ప్రాణ రక్షణ కోసం రోడ్లపైకి పరుగులు తీశారు.

రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైందని, కోల్‌కతా నగరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే దీని భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. నగరంలోని పలు వాణిజ్య సముదాయాల్లో ఫర్నిచర్ కదలడం, గోడలు ప్రకంపనలకు గురికావడంతో ఉద్యోగులు తక్షణమే ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story