దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లోఒకటైన లడఖ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత లడఖ్‌లోని లేహ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. కాగా.. భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్‌సీఎస్ తెలిపింది. కాగా.. జపాన్‌లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.