అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

Earthquake of 3.7 Magnitude hit Arunachal Pradesh.అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భూకంపం సంభవించినట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 3:18 AM GMT
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4.07 గంట‌ల‌కు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. దీని తీవ్రత రిక్ట‌ర్ స్కేల్‌పై 3.7గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. తవాంగ్‌కు ఉత్తరాన 81 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. కాగా.. భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అందలేద‌ని అధికారులుతెలిపారు.

మ‌రోవైపు.. పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశంలోనూ అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌కు 303 కిలోమీటర్ల దూరంలో భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయ‌ని ఎన్‌సీఎస్ తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర 4.8గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. భూకంప కేంద్రాన్ని 120 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే.. నిన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌కు దక్షిణాన 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగ‌తి తెలిసిందే.

సెప్టెంబర్‌లో సంభవించిన భూకంపాలపై NCS ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. హిందూ కుష్ ప్రాంతం, ఉత్తర భారతదేశంలో (లడఖ్, జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్), ఈశాన్య భారతదేశం, పశ్చిమ (గుజరాత్‌లోని రాజ్‌కోట్ మరియు వల్సాద్; మహారాష్ట్రలోని ఔరంగాబాద్, సతారా మరియు లాతూర్), దక్షిణాన (కర్ణాటకలోని విజయపుర/బీజాపూర్) ప్రాంతాల్లో ఎక్కువ‌గా భూప్ర‌కంన‌లు చోటు చేసుకున్నాయి.

Next Story