అండమాన్‌ దీవుల్లో భూకంపం

Earthquake in the Andaman Islands.అండ‌మాన్ దీవుల్లో భూకంపం సంభ‌వించింది. గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత భూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 2:55 AM GMT
అండమాన్‌ దీవుల్లో భూకంపం

అండ‌మాన్ దీవుల్లో భూకంపం సంభ‌వించింది. గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.8గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. రాత్రి 1.37 గంట‌ల స‌మ‌యంలో నికోబార్ దీవిలోని క్యాంప్ బెలే బే నుంచి 640 కిలోమీట‌ర్ల దూరంలో, భూమికి ప‌ది కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు ఎస్‌సీఎస్ తెలిపింది.

ఇదిలా ఉంటే.. భార‌త్ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. గురువారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌ లోని కత్రా, యూపీలోని మీరట్, ఉత్తరాఖండ్‌ లోని గర్హ్వాల్‌, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలు స్వల్పంగా రావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇళ్లలోంచి ప‌రుగులు తీశారు.

Next Story