అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. 24 గంటల్లో మూడోసారి

వరుస భూకంపాలతో అండమాన్‌ నికోబార్‌ దీవులు గజ గజ వణుకుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి

By అంజి  Published on  10 April 2023 2:30 AM GMT
Andaman Nicobar Islands , Earthquake,Campbell Bay

అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. 24 గంటల్లో మూడోసారి

వరుస భూకంపాలతో అండమాన్‌ నికోబార్‌ దీవులు గజ గజ వణుకుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయింది. భూకంప కేంద్రం క్యాంప్‌బెల్‌ తీరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 32 కిలోమీటర్ల లోతున ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి అండమాన్‌ దీవుల్లో భూకంపం రావడం ఇది మూడోసారిది. నికోబార్ దీవుల్లో మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే మరోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 6వ తేదీన కూడా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది.

Next Story