దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాపకింద నీరులా మళ్లీ వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా తమిళనాడులో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తమిళనాడుకు వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాల వారికి మినహాయింపు ఇచ్చారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది.
తమిళనాడులోని కేసుల సంఖ్య బాగానే పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలోనే కేసులు పెరుగుతున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. దీంతో తమిళనాడులోకి వెళ్లాలంటే, ఈ–పాస్ పొందాల్సిందేనన్న ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిల నుంచి వచ్చే వారికి మాత్రం ఈ-పాస్ నుంచి మినహాయింపు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడకు నేరుగా వచ్చే వాళ్లు, ఇతర రాష్ట్రాల మీదుగా విదేశాల నుంచి తమిళనాడులోకి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఈ–పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది.
కాగా, తమిళనాడులో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టడంతో కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఇతర ప్రాంతాల నుంచి తమిళనాడుకు వచ్చే వారితో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా మళ్లీ కరోనా కేసులు పెరగిపోతుండటంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు మళ్లీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో కూడిన ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది. భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.