ఢిల్లీలో 'డ్రైవ్ త్రూ కొవిడ్ వ్యాక్సిన్'కి శ్రీకారం

Drive Through Vaccination.ఢిల్లీలో కారులో వెళ్తూ వెళ్తూనే కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్లిపోయే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

By Medi Samrat  Published on  26 May 2021 11:13 AM GMT
Drive Through Vaccination

కార్లో వెళ్తూ కప్పు కాఫీ కొనుక్కొని తాగుతూ డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయే సీన్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం.. ఇప్పుడు కాఫీలు తాగే సీన్, టిఫినీలు కొనే సీన్లు లేవు.. ఎందుకంటే ఎక్కడ చూసినా కరొనా నే కదా.. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసేస్తోంది. ప్రజలంతా ఈ మహమ్మారి పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని నిపుణులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న రీతిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టింది. కారులో వెళ్తూ వెళ్తూనే కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్లిపోయే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోనే మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు ప్రారంభించారు. ద్వారకా లోని వేగస్ మాల్‌లో ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భాగస్వామ్యంతో 'డ్రైవ్-త్రూ కొవిడ్ – 19 టీకా కార్యక్రమాన్ని స్టార్ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు కావల్సినంత టీకా సరఫరా కోసం వేచి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని టీకాలను అందిస్తే ఇలాంటి మరెన్నో కేంద్రాలు త్వరలోనే ఢిల్లీ వ్యాప్తంగా ప్రారంభిస్తా మన్నారు. నిన్న మొన్నటి వరకు కారు దిగకుండానే కరోనా టెస్ట్ లు జరుగగా ఇప్పుడు కారులో ఉండగానే వాక్సినేషన్ పూర్తవ్వటం చాలా సులువుగా ఉంటోందిని స్థానిక ప్రజలు చెబుతున్నారు.Next Story
Share it