పాక్‌కు భారత రహస్య సమాచారం అందించిన.. డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్‌

పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన ఓ విభాగంలో పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్తను గూఢచర్యం

By అంజి  Published on  5 May 2023 7:30 AM IST
DRDO, scientist,  Pune , India secret information, Pakistan

పాక్‌కు భారత రహస్య సమాచారం అందించిన.. డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్‌

పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన ఓ విభాగంలో పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్తను గూఢచర్యం ఆరోపణలపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. మే 3న పూణేలోని డీఆర్‌డీవో శాస్త్రవేత్త అధికారిక విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 'పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్' (పీఐఓ) ఏజెంట్‌తో సంబంధాలున్నట్లు తేలిందని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శాస్త్రవేత్త వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో మొదలైన వాటి ద్వారా సోషల్ మీడియా ద్వారా పీఐఓతో టచ్‌లో ఉన్నాడు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ డీఆర్డీవో అధికారి తన పదవిని దుర్వినియోగం చేశారని, తద్వారా సున్నితమైన ప్రభుత్వ రహస్యాలను పాక్‌కు చెరవేశాడని అధికారులు తెలిపారు. భారత్‌ రహస్యాలు శత్రు దేశం చేతిలో పడితే భారతదేశ భద్రతకు పెను ముప్పు పొంచి ఉంటుంది. కాలాచౌకి ముంబైలోని ఏటీఎస్‌ పోలీస్ స్టేషన్, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 1923, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, పూణే యూనిట్‌లోని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్‌లో ఉన్న ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story