'వీబీ-జీ రామ్ జీ చట్టంపై అపోహలను నమ్మొద్దు'.. కేంద్రం కీలక ప్రకటన
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత భారత్ జీ రామ్ జీ యోజన (VB-G RAM G) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
By - అంజి |
'వీబీ-జీ రామ్ జీ చట్టంపై అపోహలను నమ్మొద్దు'.. కేంద్రం కీలక ప్రకటన
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత భారత్ జీ రామ్ జీ యోజన (VB-G RAM G) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కొత్త చట్టం గురించి రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి అధికారులకు కేంద్ర అధికారులు వీడియో కాన్పరెన్స్‌లో వివరించారు. ఏడాదికి 125 పని దినాలు ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
వీబీ-జీ రామ్ జీ చట్టంపై అపోహలను నమ్మొద్దని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ఈ పథకం నిరుద్యోగులకు పని కల్పించడంలో ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు.
''ప్రియమైన సోదర సోదరీమణులారా, అపోహలను నమ్మకండి! 'వికసిత భారత్ జీ రామ్ జీ యోజన' గ్రామీణ ఉపాధిలో మనరేగా (MGNREGA) కంటే ప్రయోజనాత్మకమైన విప్లవాత్మక అడుగు'' అని శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
VB-G RAM G వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. 100 రోజులకు బదులు 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించే హామీ అని, ఆ నిర్ణీత సమయంలో పని లేని పక్షాన తమ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కల్పిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. వేతనాలు ఆలస్యమైతే అదనపు పరిహారం చెల్లించే బాధ్యత బిజెపి ప్రభుత్వానిదన్నారు. రూ.1,51,282 కోట్ల రూపాయలు కేటాయించి కార్మిక సోదరులకు ప్రధాని మోదీ ఉపాధి కల్పిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు.
''గ్రామీణ స్తాయిలో ఉపాధి అవకాశాలను పెంచే ఈ పథకం పై విపక్షాలు విషం చిమ్మడం దురదృష్టకరం... రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు నా విజ్ఞప్తి'' అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ప్రియమైన సోదర సోదరీమణులారా, అపోహలను నమ్మకండి! 'వికసిత భారత్ జీ రామ్ జీ యోజన' గ్రామీణ ఉపాధిలో మనరేగా (MGNREGA) కంటే ప్రయోజనాత్మకమైన విప్లవాత్మక అడుగు.VB-G RAM G వల్ల ప్రయోజనాలు:🔸100 రోజులకు బదులు 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించే హామీ🔸ఆ నిర్ణీత సమయంలో పని లేని పక్షాన… pic.twitter.com/ipbKF4Ybam
— BJP Telangana (@BJP4Telangana) December 22, 2025