ఆస్పత్రిలో డాక్టర్‌ నగ్నంగా తిరుగుతూ హల్‌చల్‌.. సీసీ కెమెరాల్లో రికార్డ్

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నగ్నంగా తిరుగుతూ కెమెరాకు చిక్కాడు.

By అంజి  Published on  10 March 2024 12:09 PM IST
doctor, Maharashtra, hospital, Sambhajinagar

ఆస్పత్రిలో డాక్టర్‌ నగ్నంగా తిరుగుతూ హల్‌చల్‌

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నగ్నంగా తిరుగుతూ కెమెరాకు చిక్కాడు. మద్యం మత్తులో వైద్యుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు 45 ఏళ్ల వైద్యుడు మాదకద్రవ్యాలకు బానిస. ఔరంగాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిడ్కిన్‌ గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆస్పత్రి ఆవరణలో ఎలాంటి బట్టలు లేకుండా డాక్టర్ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.

అతను వాష్‌రూమ్‌లోకి వెళ్లే ముందు, కారిడార్‌లో క్లాత్‌ ముక్కను ఊపుతూ కనిపించాడు, వాష్‌ రూమ్‌ తలుపు తెరిచి ఉంది. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ దయానంద్ మోతిపావ్లే మాట్లాడుతూ.. విచారణ జరుగుతోందని, దోషిగా తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని మెడికల్ సూపరింటెండెంట్‌కు నివేదించామని, డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Next Story