ఇవాళ ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్‌ ప్రత్యేకత తెలుసా?

Do you know what is special about the blue jacket worn by Prime Minister Modi in Parliament today?. ప్రకృతిని ప్రేమిస్తామంటూ పెద్ద ప్రతిజ్ఞలు చేయడం కాదు.. దాన్ని ఆచరణలో పెట్టేవారే అసలైన

By అంజి  Published on  8 Feb 2023 3:04 PM IST
ఇవాళ ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్‌ ప్రత్యేకత తెలుసా?

ప్రకృతిని ప్రేమిస్తామంటూ పెద్ద ప్రతిజ్ఞలు చేయడం కాదు.. దాన్ని ఆచరణలో పెట్టేవారే అసలైన ధీరులు. ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందించాల్సిందే. వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్త ఏరుతూ అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధాని మోదీ.. బుధవారం ప్రత్యేకమైన బ్లూ కలర్‌ జాకెట్‌ ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. మోదీ ధరించిన నీలిరంగు జాకెట్ ప్రత్యేకమైనది అని ఎందుకు అన్నామంటే.. అది రీసైకిల్ చేయబడిన పెట్‌ బాటిళ్లతో తయారు చేయబడింది.

బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సమర్పించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చారు. బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని మోదీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ జాకెట్‌ను బహుకరించింది. ఐఓసీ ఉద్యోగులు, సాయుధ దళాల కోసం స్థిరమైన వస్త్రాలను తయారు చేయడానికి 10 కోట్ల కంటే ఎక్కువ పెట్‌ సీసాలు రీసైకిల్ చేసి దుస్తులు తయారు చేశారు. దీని వల్ల ప్రకృతికి మేలు జరగడంతో పాటు.. మనకు దుస్తులుగా ఉపయోగపడతాయి.

ఇటీవల ప్రభుత్వం రూ. 19,700 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది. ఇది ఆర్థిక వ్యవస్థను తక్కువ కార్బన్ తీవ్రతకు మార్చడానికి, శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఈ రంగంలో సాంకేతికత, మార్కెట్ నాయకత్వాన్ని దేశం స్వీకరించేలా చేస్తుంది. బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన, నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35,000 కోట్లను అందించారు. ప్రభుత్వం ఏడు ప్రాధాన్యతలలో హరిత వృద్ధిని జాబితా చేశారు.

Next Story