కేంద్రం తీసుకొచ్చిన 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌ గురించి తెలుసా?

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 'రాజ్‌మార్గ్‌యాత్ర' పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రూట్‌ మ్యాప్స్‌ దగ్గర నుంచి స్మార్ట్‌ అలర్ట్స్‌ వరకు అనేక ఫీచర్లు ఉన్నాయి.

By అంజి  Published on  13 Oct 2024 5:30 AM GMT
Rajmargyatra, central government, business, NHAI

కేంద్రం తీసుకొచ్చిన 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌ గురించి తెలుసా?

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 'రాజ్‌మార్గ్‌యాత్ర' పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రూట్‌ మ్యాప్స్‌ దగ్గర నుంచి స్మార్ట్‌ అలర్ట్స్‌ వరకు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫాస్టాగ్‌కు సంబంధించిన సర్వీసులూ ఈ యాప్‌ నుంచి పొందొచ్చు. ప్రధాన రహదారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే చేయొచ్చు. రహదారికి సంబంధించిన సమస్యను ఫొటో లేదా వీడియో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుంది. కంప్లైంట్‌ స్టేటస్‌ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

రహదారిలో ఉండే టోల్‌ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా నేషనల్‌ హైవేలపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు అవసరం అయ్యే రెస్టారెంట్లు, పెట్రోల్‌ పంపులు, ఛార్జింగ్‌ స్టేషన్లు, ఏటీఎంలు, ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లు, టూరిస్ట్‌ ప్లేస్‌ల సమాచారం కనిపిస్తుంది. అలాగే వెదర్‌, ట్రాఫిక్‌ అలర్టులు కూడా లభిస్తాయి. ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కొత్త ఫాస్టాగ్‌కు అప్లికేషన్‌, నెలవారీ పాస్‌లు, ఫాస్ట్‌ ట్యాగ్‌ సంబంధిత ఇతర సర్వీసులూ లభిస్తాయి.

ఓవర్‌ స్పీడ్‌ నోటిఫికేషన్‌ సదుపాయం కూడా ఇందులో ఉంది. పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నప్పుడు అది మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఈ ఫెసిలిటీ తీసుకొచ్చింది. హైవే అసిస్టెన్స్‌, పోలీస్‌ అసిస్టెన్స్‌, ఎమర్జెన్సీ నంబర్లు.. ఎమర్జెన్సీ ఆప్షన్‌లో కనిపిస్తాయి. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ను గుగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ కావాల్సి ఉంటుంది. తెలుగుతో సహా మొత్తం 12 భాషలకు ఈ యాప్‌ సపోర్ట్ చేస్తుంది.

Next Story