తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ తనయుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఊహించని షాక్ తగిలింది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన ఉదయనిధి స్టాలిన్‌కు ఆ అవకాశం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నెలోని 'చెపాక్' లేదా థౌజండ్స్ లైట్స్ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేయాలని భావించగా.. అతడి ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం పార్టీ యువజన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్.
ఈ నేపథ్యంలోనే మార్చ్ 6న పార్టీ పెద్దల ముందు ప్రధాన కార్యాలయం అణ్ణా అరివాలయంలో హాజరయ్యాడు. అక్కడ ఉదయనిధిని ఇంటర్వ్యూ చేసారు పార్టీ అధ్యక్షుడు, ఉదయనిధి తండ్రి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్. యువజన విభాగం కార్యదర్శిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్.. పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే తన నియోజకవర్గానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తోంది. ఉదయనిధి స్టాలిన్ స్వయంగా పోటీ చేస్తే మిగిలిన చోట్ల పార్టీ ప్రచారానికి ఇబ్బంది తలెత్తుతుందని భావించి.. ఉదయనిధి స్టాలిన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ పోటీ నుంచి వైదొలిగ్గా.. ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ డీఎంకే పార్టీ తీర్మానం చేసింది.