తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన 118 స్థానాలు దాటేసింది. డీఎంకే ప్రస్తుతం 138 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఎంకే స్టాలిన్‌ కలత్తూరులో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కూర్చోవడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకుండానే జరిగిన అసెంబ్లీ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ మొదట పార్టీని పటిష్టం చేశారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు స్టాలిన్‌. అన్నాడీఎంకే ను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లారు. అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బీజేపీతో కూటమిగా ఏర్పడిన అన్నాడీఎంకే విధానాలను తీవ్రంగా విమర్శించే వారు స్టాలిన్. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో ప్రసంగాలు ఇచ్చి.. తన మీద నమ్మకం ఏర్పడేలా చేసుకున్నారు.

స్టాలిన్ ను గ్రామాల్లోని ప్రజలు కూడా ఎక్కువగా నమ్మారు. స్టాలిన్ వస్తేనే మా సమస్యలు తీరతాయని వారు కూడా చెప్పుకొనేవారు. అలంటి చోట్లనే డీఎంకేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. త‌మ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డంతో డీఎంకే నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అప్పుడే సంబ‌రాలు ప్రారంభించారు. ప‌లు చోట్ల బాణ‌సంచా కాల్చుతూ డ్యాన్సు చేస్తున్నారు. త‌మిళ‌నాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం,కమల హాసన్ పోటీ చేసిన స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.


సామ్రాట్

Next Story