ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ వేళ బాణాసంచాను బ్యాన్ చేసింది. బాణాసంచాను నిల్వచేయడం, అమ్మడం, ఉపయోగించడాన్ని నిషేదిస్తున్నట్లు ట్విటర్ వేదికగా సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాలుగా ఏర్పడుతున్న కాలుష్య స్థాయిలను పరిగణలోనికి తీసుకుని.. బాణాసంచాపై నిషేదం విధిస్తున్నామని తెలిపారు. క్రాకర్స్‌పై నిషేదం విధించడం వల్ల కొన్ని జీవితాలను అయిన కాపాడుకోవచ్చునని సీఎం తెలిపారు.
గత ఏడాది కూడా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. నాడు ఆలస్యంగా నిర్ణయాన్ని ప్రకటించడం కారణంగా.. బాణాసంచాను అప్పటికే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్న వ్యాపారులకు నష్టం వాటిల్లిందని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో గుర్తు చేశారు. గత అనుభవం దృష్ట్యా.. వ్యాపారులెవరూ బాణాసంచాను నిల్వ చేయవద్దని అభ్యర్థించారు.