యాంటీబయాటిక్స్ దుర్వినియోగం.. డాక్టర్లకు, ఫార్మాసీలకు కేంద్రం కఠిన నిబంధనలు జారీ

యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, కెమిస్ట్ లకు కఠినమైన నిబంధనలను తీసుకుని వచ్చింది.

By అంజి  Published on  18 Jan 2024 2:15 PM GMT
DGHS, pharmacists , antibiotics, doctors

యాంటీబయాటిక్స్ దుర్వినియోగం.. డాక్టర్లకు, ఫార్మాసీలకు కేంద్రం కఠిన నిబంధనలు జారీ

యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, కెమిస్ట్ లకు కఠినమైన నిబంధనలను తీసుకుని వచ్చింది. ఇకపై అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇటీవలి కాలంలో తుమ్ములు వచ్చినా, శరీరం అలసటకు గురైనా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. మోతాదుకు మించిన యాంటీ బయాటిక్స్ వాడితే చాలా ఇబ్బందులు వస్తాయి. యాంటీ బయాటిక్ శరీరానికి ఎంత మేరకు అవసరం ఉంటుందనే విషయాన్నే మరచిపోయి వాడేస్తూ ఉన్నారు.

ఇక రోగులకు యాంటీ బయాటిక్స్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని వివరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియజేయాలని వైద్యుల్ని కోరింది. యాంటిమైక్రోబయాల్స్ సూచించేటప్పుడు ఖచ్చితమైన సూచన/కారణం/జస్టిఫికేషన్‌ను తప్పనిసరిగా పేర్కొనవలసిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ తాజాగా ఓ లేఖలో వివరించారు.

వైద్యులు మాత్రమే కాకుండా, ఫార్మసిస్ట్‌లకు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ H, H1ని అమలు చేయాలని, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌లపై మాత్రమే యాంటీబయాటిక్‌లను విక్రయించాలని సూచించారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) భారతదేశంలోని అన్ని ఫార్మసిస్ట్ అసోసియేషన్‌లకు ఒక లేఖ రాసింది, అర్హత కలిగిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే యాంటీబయాటిక్‌లను పంపిణీ చేయాలని ఫార్మసిస్ట్‌లకు అత్యవసర విజ్ఞప్తి చేసింది.

Next Story