గొడవ పడి బావిలో దూకిన భర్త.. ప్రాణాలు కాపాడిన భార్య

గురువారం ఉత్తరప్రదేశ్‌లోని కురారా గ్రామంలో హన్స్ కుమార్ (35) తన భార్య సునీత (32)తో గొడవ పడి ఆవేశంతో ఇంటి నుంచి బయటకు పరిగెత్తి సమీపంలోని బావిలోకి దూకాడు.

By అంజి  Published on  8 March 2024 10:42 AM IST
Uttarpradesh, woman adventure, Hamirpur district

గొడవ పడి బావిలో దూకిన భర్త.. ప్రాణాలు కాపాడిన భార్య

గురువారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా కురారా గ్రామంలో హన్స్ కుమార్ (35) తన భార్య సునీత (32)తో గొడవ పడి ఆవేశంతో ఇంటి నుంచి బయటకు పరిగెత్తి సమీపంలోని బావిలోకి దూకాడు. అతను మునిగిపోవడం ప్రారంభించినప్పుడు, హన్స్ కుమార్ సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. వెంటనే బావి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, కాని ఎవరూ అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు. భర్త బావిలో దూకాడన్న విషయం తెలుసుకున్న సునీత ఇంటి నుంచి బయటకు వచ్చి చూసింది.

అప్పటికే భర్త బావిలో ఊపిరి పీల్చుకుంటూ కనిపించాడు. ఆ వెంటనే భార్య ప్రాణభయం లేకుండా త్వరగా తాడు తీసుకుని బావిలోకి దిగింది. అప్పటికి స్పృహ భర్త స్పృహా కోల్పోయాడు. దీంతో ఇతర గ్రామస్థులు ఆమెకు సహాయం చేసి భర్తను బయటకు తీశారు. హన్స్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతను స్పృహలోకి వచ్చారని, అతని పరిస్థితి నిలకడగా ఉందని కురారా ఎస్‌హెచ్‌ఓ యోగేష్ తివారీ తెలిపారు. "అతను చిన్న ఫ్రాక్చర్‌తో బాధపడ్డాడు, అయితే త్వరలో కోలుకుంటాడు" అని ఎస్‌హెచ్‌వో చెప్పారు.

Next Story