వైరల్ వీడియో చేసాడు.. చివరికి ఊచలు లెక్క పెడుతున్నాడు

Delhi YouTuber Arrested For Video Of 'Flying Dog'. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక యూట్యూబర్ తన పెంపుడు కుక్కకు హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు.

By Medi Samrat  Published on  27 May 2021 2:05 PM GMT
Delhi YouTuber Arrested

లాక్‌డౌన్ అంటే పెండింగ్ ఉన్న పనులు చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేవారు ఎందరో.. కానీ కొందరుంటారు పనీపాటా లేక ఖాళీగా ఉంటూ కొత్తగా చేద్దాం, వీడియో చేసి వైరల్ చేద్దాం అనుకోని చేసే పనులు క్రూరత్వానికి పరాకాష్టగా మారుతున్నాయి. మానవత్వం మరిచిపోయి ఓ యువకుడు ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.

తాజాగా ఢిల్లీకి చెందిన ఒక యూట్యూబర్ ఓక కొత్తరకం వీడియో కోసం ట్రై చేసాడు. తన పెంపుడు కుక్కకు హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది వీడియో తీసాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో చూసినవాళ్లంతా యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఢిల్లీలోని ఒక పార్కులో గౌరవ్ కుక్కకు అనేక హైడ్రోజన్ బెలూన్లను కట్టి ఎగిరేలా చేశాడు. కుక్క గాలిలో కొద్దిసేపు అలానే ఉండి తరువాత అది కిందకు దిగింది. ఈ వీడియోను గౌరవ్ యూట్యూబ్‌లో షేర్ చేసిన తరువాత జంతు హక్కుల సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి మనుషులతోనే కాకుండా ఇతర జీవులను కూడా మనిషి గౌరవించాలని, అలా చేయకపోతే మానవత్వానికి అర్థమే ఉండదన్నారు.

పోలీసులు జంతు హింస కేసు కింద గౌరవ్ జాన్, అతని తల్లిపై 188, 269, 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. యూట్యూబర్ గౌరవ్‌జాన్ ను అరెస్టు చేశారు. అయితే ఫిర్యాదుల అనంతరం గౌరవ్ ఆ వీడియోను తొలగించాడు. వీడియో చేయడానికి ముందు తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నానన్నాడు. అయినా సరే చాలామంది మనసులు గాయపడ్డాయని ఆ విషయంలో తనను క్షమించమని కోరాడు.



Next Story