క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. అందరూ చూస్తుండగా..

Delhi woman slaps cab driver. సైడ్‌ ఇవ్వలేదని ఓ మహిళ నడి రోడ్డుపై క్యాబ్‌ డ్రైవర్‌ను కారు నుండి బయటికి లాగి చెంప చెళ్లుమనిపించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

By అంజి  Published on  17 Nov 2021 4:47 PM IST
క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. అందరూ చూస్తుండగా..

సైడ్‌ ఇవ్వలేదని ఓ మహిళ నడి రోడ్డుపై క్యాబ్‌ డ్రైవర్‌ను కారు నుండి బయటికి లాగి చెంప చెళ్లుమనిపించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. రోడ్డుపై అప్పటికే ట్రాఫిక్‌ భారీగా ఉంది. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ స్కూటీకి దారి ఇవ్వలేదు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళ స్కూటీని పక్కన ఆపి.. క్యాబ్‌ నుండి డ్రైవర్‌ను బయటకు లాగింది. అతడి చొక్కా పట్టుకుని, దూషిస్తూ అందరిముందు చెంప పగలకొట్టింది. అక్కడే ఉన్న కొందరు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారిపై కూడా విరుచుకుపడింది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ ఫొన్లో చిత్రకరీంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో, మహిళ డ్రైవర్ కాలర్ పట్టుకుని అతనిపై పంచ్‌లు మరియు చెంపదెబ్బలు కొడుతున్నట్లు చూడవచ్చు. క్యాబ్ డ్రైవర్ నుంచి ఫిర్యాదు అందితే మహిళపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వెస్ట్ పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వచ్చింది. పోలీసులు ఇప్పుడు ఆమె స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వీడియోలోని మహిళను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2 నిమిషాల కంటే తక్కువ నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో నీలిరంగు టీ-షర్టు, ముఖానికి ముసుగు ధరించిన మహిళ రోడ్డు మధ్యలో క్యాబ్‌ డ్రైవర్‌ కాలర్‌ను పట్టుకోవడం కనిపిస్తుంది.


Next Story