శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగానే గుండెపోటు

రామలీలాలో నటిస్తూ ఉండగానే గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఢిల్లీలోని ఓ రామ్‌లీలా కార్యక్రమంలో రాముడి పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి స్టేజ్‌పై నొప్పిని అనుభవిస్తూ చివరికి ప్రాణాలు విడిచాడు.

By అంజి  Published on  6 Oct 2024 5:31 PM IST
Delhi Man , Lord Ram, Ramlila , Heart Attack

శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగానే గుండెపోటు

రామలీలాలో నటిస్తూ ఉండగానే గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఢిల్లీలోని ఓ రామ్‌లీలా కార్యక్రమంలో రాముడి పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి స్టేజ్‌పై నొప్పిని అనుభవిస్తూ చివరికి ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటన ఓ వీడియో కెమెరాకు చిక్కింది.

తూర్పు ఢిల్లీ నివాసి సుశీల్ కౌశిక్ (45) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. సుశీల్ ఒక సన్నివేశంలో నటిస్తూ ఉండగా అతడికి హార్ట్ అటాక్ వచ్చింది. లేచి రెండడుగులు వేసి ముందుకు నడుస్తూ ఉండగా కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఛాతీపై చేయి వేసుకుని, సుశీల్ తెరవెనుకకు పరుగెత్తాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని ఆనంద్ విహార్‌లోని కైలాష్ దీపక్ ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

Next Story