ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు
Delhi lockdown extended till May 31. దేశ రాజధానిలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని డిసైడ్ అయ్యింది.
By Medi Samrat Published on 23 May 2021 2:43 PM ISTదేశ రాజధానిలో కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని డిసైడ్ అయ్యింది. ఒక్కసారిగా ఢిల్లీలో కేసులు పెరిగిపోయినప్పుడు అక్కడి ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి లాక్ డౌన్ విధించారు. దీంతో కేసులు కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. ఆదివారం ఢిల్లీలో కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. మరో వారం రోజుల పాటు అంటే 2021, మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
కరోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గిందన్నారు. ఆక్సిజన్, బెడ్లు ఇతర సమస్యలు అధిగమించామన్నారు. అయితే ఢిల్లీలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత నెలకొందని ఈ విషయం పై కేంద్రం, వ్యాక్సిన్ కంపెనీలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను కొద్ది కొద్దిగా సడలిస్తామన్నారు. కరోనాతో పోరు ఇంకా అయిపోలేదన్న కేజ్రీవాల్.. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ లోపే వాక్సిన్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.
ఏప్రిల్ 19న ఢిల్లీలో మొదటిసారి లాక్‌డౌన్ ప్రకటించారు. తరువాత పరిస్థితి ని బట్టీ పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. రేపు అంటే మే 24 ఉదయం 5 గంటలతో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి 31 వరకు మళ్లీ పొడిగించారు.
इस समय हमारी सबसे बड़ी प्राथमिकता दिल्ली के सभी लोगों को जल्द से जल्द वैक्सीन लगाना है ताकि संभावित तीसरी लहर से लोगों को बचा सकें, दिल्ली के लोगों के लिए हम किसी भी क़ीमत पर वैक्सीन खरीदने के लिए तैयार हैं। pic.twitter.com/Jkp9mz0vOc
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2021